Nee choopule

Recipe

Nee choopule

Movie : Endukante Premanta
Lyricist : Ramajogayya Sastry
Music : G. V. Prakash Kumar
Singer : Haricharan, Chitra


Telugu

నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చెలి...
అమవాసనై ఉన్నామరి అందించవే దీపావళి..
ఎందుకె చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా...
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా...
నయనం..హృదయం..నీవే..నీవై..
సమయం వెనుకే చేశా పయనం..
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే..
ఈ క్షణాన ఊపిరాపనా..

రోజే కొత్తగా...నీ సందర్శనం...
ఆహా అన్నదీ...నాలో స్పందనం...
నిత్యం నువ్విలా...నాకై చూడటం...
ఎంతో వింతగా ఉందీ అనుభవం...
నడి వేసవిలో మరిగిస్తూనే మురిపిస్తూందే నీ చల్లదనం..
ఎద మంటంతా దాచేస్తూ వెన్నెలయింది ప్రేమ గుణం..
నీకై వేచే నిట్టూరుపులే తూరుపు కానీ..
నీ తలపులలో తలమునకవని ఎన్నో జన్మలనీ..
నయనం..హృదయం..నీవే..నీవై..
సమయం వెనుకే చేశా పయనం..
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే..
ఈ క్షణాన ఊపిరాపనా..

నీతో బంధమే రాసిందెవ్వరో నిన్నే నాకిలా చూపిందెవ్వరో..
నన్నీ వైపుగా లాగిందెవ్వరో నిన్నే చూడగా అపిందెవ్వరో..
దరిదాపుల్లో పడిగాపుల్లో పడి నిలిచా నీ రహదారుల్లో..
తొలి వెలుగల్లే వస్తాలే కలిసే రేపటి పొద్దుల్లో..

హా..నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చెలి...
అమవాసనై ఉన్నామరి అందించవే దీపావళి..
ఎందుకె చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా...
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా...
నయనం..హృదయం..నీవే..నీవై..
సమయం వెనుకే చేశా పయనం..
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే..
ఈ క్షణాన ఊపిరాపనా..



English

Nee choopule na oopiri osarila choode cheli…
amavasanai vunna mari andinchavee deepavali..
enduke cheliya reppala valalo odigina kalalaa..
kanupaapalu vethike repati velugunu choosi choodavelaa..
nayanam..hrudayam..neeve..neevai ..
samayam venuke chesa payanam..
tadupari janmakaina jaalichoose veelundante ..
ee kshanaana oopirapanaa…

Rooju kothagaa..nee sandarshanam ..
aha annadi..naalo spandanam..
nityam nuvvilaa naakai choodatam..
enthovinthagaaa undi anubhavam..
nadiveesavilo marigithoone muripisthunde nee challadanam..
edha mantanthaa daachesthu vennelaindee prema gunam..
neekai veeche nittorupule thoorupukaani..
neethaalapulalo thalamunakalavani enno janmalani..
nayanam..hrudayam..neeve..neevai ..
samayam venuke chesa payanam..
tadupari janmakaina jaalichoose veelundante ..
ee kshanaana oopirapanaa…

Neetho bhandhamee raasindevvaroo..
ninne naakilaa choopindevvaroo..
nannevaipugaaa laagindevvaroo..
nineechoodagaaa aapindevvarooo..
daridapullo padigapullo padiniliche neeredarullo..
tholivelugalle vasthalee kaliseerepatipodduloo..

Ha..nee choopule na oopiri osarila choode cheli…
amavasanai vunna mari andinchavee deepavali..
enduke cheliya reppala valalo odigina kalalaa..
kanupaapalu vethike repati velugunu choosi choodavelaa..
nayanam..hrudayam..neeve..neevai ..
samayam venuke chesa payanam..
tadupari janmakaina jaalichoose veelundante ..
ee kshanaana oopirapanaa…

Leave a Comment