Ee Velalo Neevu Em Chestu Vuntavo

ee velalo neevu

Ee Velalo Neevu Em Chestu Vuntavo

Movie : Gulabi
Lyricist : Sirivennela Sitarama Sastry
Music : Shashi Preetam
Singer : Sunita


Telugu

ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో
అనుకుంటు వుంటాను ప్రతి నిమిషము నేను
నా గుండె ఏనాడో చేయి జారి పోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన వుంటునే ఏం మాయ చేసావో
ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో
అనుకుంటు వుంటాను ప్రతి నిమిషము నేను

నడి రేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము ఓ ఓ గడిపేదెలా కాలము
పగలైన కాసేపు పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానము ఓ ఓ నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తొచింది
నువు కాక వేరేది కనిపించనంటొంది
ఈ ఇంద్ర జాలాన్ని నీవేన చేసింది
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఎం తొచనీకుంది
నీ మీద ఆశేదొ నను నిలువనీకుంది
మతి పొయి నేనుంటె నువు నవ్వుకుంటావు
ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో
అనుకుంటు వుంటాను ప్రతి నిమిషము నేను
ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో
అనుకుంటు వుంటాను ప్రతి నిమిషము నేను



English

ee velalo neevu em chestu vuntaavo
anukuntu vuntaanu prati nimishamu nenu
naa gunde enaado cheyi jaari poyindi
nee needagaa maari naa vaipu raanandi
dooraana vuntune em maaya chesaavo
ee velalo neevu em chestu vuntaavo
anukuntu vuntaanu prati nimishamu nenu
nadi reyilo neevu nidaraina raaneevu
gadipedelaa kaalamu o o gadipedelaa kaalamu
pagalaina kaasepu pani chesukoneevu
nee meedane dhyaanamu o o nee meedane dhyaanamu
e vaipu choostunnaa nee ruupe tochindi
nuvu kaaka veredi kanipinchanantondi
ee indra jaalaanni neevena chesindi
nee perulo edo priyamaina kaipundi
nee maata vintuune em tochaneekundi
nee meeda asedo nanu niluvaneekundi
mati poyi nenunte nuvu navvukuntaavu
ee velalo neevu em chestu vuntaavo
anukuntu vuntaanu prati nimishamu nenu
ee velalo neevu em chestu vuntaavo
anukuntu vuntaanu prati nimishamu nenu

Leave a Comment